మెగా ఫ్యామీలి నుంచి హీరోయిన్ గా వచ్చిన నిహారిక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటుచేసుకుంది. తన నటన, అందంతో ప్రేక్షకులను అలరిస్తుంది. రోటిన్ సినిమాలు కాకుండా కథ బలంగా ఉండే సినిమాలు చేస్తుంది. తొలి చిత్రం ఒక మనసు తో సినిమా ప్లాప్ అయినా తన నటనకు మంచి మార్కులే వచ్చాయి. ఇక నిహారిక తాజాగా నటించిన సినిమా హ్యాపి వెడ్డింగ్. ఇటివలే ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.
తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది నిహారిక. అమ్మాయిలకు పెళ్లి చేసుకునే సమయం వచ్చినప్పుడు కొన్ని కోరికలు ఉండటం కామన్ అని అది ప్రతి అమ్మాయి తనకు వచ్చే భర్త గురించి కళలు కంటుందని..అలాగే నాకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయని చెప్పింది.
కానీ కొందరి జీవితంలో చిన్న చిన్న తప్పులు జరుగుతాయని… అలాంటి తప్పులు చూసిన తర్వాత..తాను పద్దతిగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని చెప్పింది. మా ఇంట్లో నాకు ఉహ తెలిసినప్పటి నుంచి జరిగిన మొదటి పెళ్లి మా పెద్దనాన్న చిరంజీవి రెండవ కూతురు శ్రీజ విహహం అని ఆ పెళ్లీ లో చాలా ఎంజాయ్ చేశామన్నారు. నాకు రోటిన్ లవ్ స్టోరీలు అంటే ఇష్టముండదని..హీరో హీరోయిన్ బేస్ లాంటి కథలు కాకుండా కథే హీరోగా ఉండే సినిమాలను చేస్తానని చెప్పారు. అలాంటి కథలు ఈమధ్యకాలంలో 8కథలకు నో చెప్పానని తెలిపింది.