అల‌రిస్తున్న ‘శ్రీనివాస క‌ళ్యాణం’ పాట‌లు

239
Nithin Srinivasa Kalyanam

నితిన్ , రాశిఖ‌న్నా జోడిగా తెర‌కెక్కుతున్న సినిమా శ్రీనివాస క‌ళ్యాణం. శ‌త‌మానం భ‌వతి లాంటి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా తీసిన స‌తీశ్ వేగ‌ష్న ఈసినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు మిక్కిజేమేయ‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామీలీ ఎంట‌టైన్మెంట్ తో ఈసినిమాను తెర‌కెక్కించారు. ఈమూవీకి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను కూడా విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్.

srinivasa kalyanam

ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇటివ‌లే ఈమూవీలోని పాట‌ల‌ను విడుద‌ల చేశారు. నేడు విడుద‌లైన ఈపాట‌లు చాలా విన‌పొంపుగా ఉన్నాయి. శ్రీనివాస క‌ళ్యాణం సినిమా విడుద‌లకు ముందే పాట‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నారు చిత్ర‌బృందం. ఈసినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిల‌వ‌నుంద‌ని చెబుతున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాతలు. రాశి ఖ‌న్నా, నందిత శ్వేత హిరోయిన్లుగా న‌టించ‌గా..ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు.

నితిన్ చివ‌ర‌గా న‌టించిన ఛ‌ల్ మోహ‌న రంగ సినిమా అంత వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌క‌పోవ‌డంతో ఈసినిమాపై ఆశ‌లు పెట్టుకున్నాడు. త‌న సెంటిమెంట్ రిలీజ్ డేట్ బొమ్మ‌రిల్లు సినిమా విడుద‌ల చేసిన రోజున ఈ సినిమాను ఆగ‌స్ట్ 9న‌ విడుద‌ల చేయ‌నున్నారు నిర్మాత దిల్ రాజు. గోదావరి జిల్లాలతో పాటు ఛండీఘర్‌లో ఈసినిమాను చిత్రిక‌రించారు. 14 సంవ‌త్సారాల త‌ర్వాత నితిన్ , దిల్ రాజు కాంబినేష‌న్ లో సినిమా రావ‌డంతో ఈమూవీపై భారీ ఆశ‌లు పెట్టుకున్నారు నితిన్ అభిమానులు.

Srinivasa Kalyanam Full Songs Jukebox | Srinivasa Kalyanam Songs | Nithiin, Raashi Khanna