తన నటన, అందంతో బుల్లి తెరపై ప్రేక్షకులను అలరిస్తోంది మెగా డాటర్ నిహారిక. అటు వెబ్ సిరిస్ , ఇటు సినిమాల్లో చేసుకుంటూ బిజీగా గుడుపుతోంది . ఒక మనసు సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యింది . ఈసినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోయినా నిహారిక నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది. నిహారిక ఇటివలే హీరోయిన్ గా నటించిన సినిమా హ్యాపీ వెడ్డింగ్. ఇటివలే ఈసినిమ షూటింగ్ పూర్తి చేసుకుంది. సుమంత్ అశ్వీన్ జోడీగా నటించిన ఈమూవీకి కార్య లక్ష్మణ్ దర్శకత్వం వహించారు.
తాజాగా షూటింగ్ సమయంలో నిహారిక ప్రమోషన్ వీడియో కు ఒకటి పోస్ట్ చేసింది. సినిమా షూటింగ్ సెట్లో ఓ వెబ్ ఛానల్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు నిహారికకు చాలా కోపం వచ్చింది. షూటింగ్ పూర్తి చేసుకుని వస్తోన్న నిహారికను ఒక అతను మేడం మీ పెళ్లి ఎప్పుడూ అని అడిగినందుకు అతనిపై ఫైర్ అయ్యింది నిహారిక. సోషల్ మీడియాలో మీ పెళ్లి విషయం బాగా వైరల్ గా మారుతోంది అని అడగగా..”నా పెళ్లి గురించి మీకెందుకయ్యా .. ఎవరిని చేసుకుంటుంది ఎందుకు రాస్తారని తిట్టింది.
మీ రెంటింగ్స్ కో్సం నన్ను వాడుకుంటారా అని మండిపడింది. దింతో వెళ్లిపోతున్న నిహారిక ను మేడం మేము అడిగింది మీ పెళ్లి గురించి కాదు…హ్యాపి వెడ్డింగ్ సినిమాలో పెళ్లి గురించి అనగానే కూల్ అయిపోతుంది నిహారిక. ఈసందర్భంగా సినిమా గురించి చెబుతూ హ్యాపి వెడ్డింగ్ సినిమా ట్రైలర్ ఈ నెల 30వ తేదిన విడుదల కాబోతున్నట్లు తెలిపింది. ఆరోజునే సినిమా విడుదల తేదిని కూడా ప్రకటించనున్నట్లు తెలిపింది. ఇంత వరకూ ఎవరూ చేయని విధంగా తన సినిమా ప్రమోషన్స్ ను చేసింది నిహారిక.