‘ఉద్యమ సింహం’గా కేసీఆర్ బయోపిక్..

214

ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. హిందీలో ఇప్పటికే సచిన్, ధోని బయోపిక్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే, తాజాగా సంజయ్ దత్ బయోపిక్ విడుదల కానుంది. ఇక తెలుగులో సావిత్రి బయోపిక్ ‘మహానటి’ విడుదలై మంచి విజాయాన్ని అందుకుంది. ఈ సినిమా విజయంతో మరికొన్ని బయోపిక్ లు తెరపైకి రావడానికి సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, వైఎస్ బయోపిక్ లు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

KCR Biopic

తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ కూడా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బయోపిక్ ప్రారంభ పూజా కార్యక్రమాలు అన్నపూర్ణ స్టూడియోలో జరుపుకుంది. ఇందులో సీఎం కేసీఆర్ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ కనిపించనున్నారు. ఈ చిత్రానికి అల్లూరి కృష్ణం రాజు దర్శకత్వం వహిస్తుండగా… కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ఉద్రమ సింహం’గా టైటిక్ ఖరారు చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నిర్వహించిన పాత్ర. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఆయన చేసిన పోరాట పటిమ, ఆయన ఎదుర్కొన్న సమస్యలను, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి ఈ బయోపిక్ లో తెరకెక్కించన్నారు.