మెగా బ్రదర్ నాగబాబు కొద్ది రోజుల నుంచి వరుసగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం నందమూరి బాలకృష్ణపై పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఇటివలే నాగబాబు మై ఛానల్ నా ఇష్టం అంటూ ఓ ట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు. ఈ ఛానల్ ద్వారా తాను పలు వీడియోలను అప్ లోడ్ చేస్తున్నాడు. తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం హీరోయిన్ లు వేసుకునే దుస్తువులను ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
పొట్టి దుస్తులు ధరించి అంగాంగ ప్రదర్శన చేయడాన్ని వారి అమాయకత్వమనుకోవాలా? లేక, అటువంటి దుస్తులు ధరిస్తే తప్ప సినిమాల్లో అవకాశాలు రావని భావిస్తున్నారని అనుకోవాలా? అని వాపోయారు . సినిమా వేడుకలకు ఎటువంటి దుస్తులు ధరించి రావాలన్న విషయం నేటి మహిళా నటులకు తెలియడం లేదన్నారు.
ఈసందర్భంగా ఈవిషయంపై నాగబాబు స్పందిస్తూ ఆడవారికి ఎలాంటి దుస్తులు వేసుకోలేవాలో చెప్పడానికి మీరు ఎవరు? అత్యాచారాలు పొట్టి దుస్తులు వేసుకున్న వారిపైన మాత్రమే జరుగుతున్నాయా? ఒళ్లంతా దుస్తులు కప్పుకునేవారిపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. మగవాడు ప్యాంట్ వేసుకోమని, పొట్టలు పెంచుకొని చూపిస్తుంటే కవర్ చేసుకోమని ఏ ఆడపిల్లైన అందా ? అని ప్రశ్నించారు. ఇక నాగబాబు చేసిన కామెంట్లకు యాంకర్ రష్మీ, శ్రీముఖి పలువురు హీరోయిన్లు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
https://youtu.be/DS6-wN6-n50