మెగా హీరో మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల

242
vaishnav tej
- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి మ‌రో హీరో ఎంట్రి ఇచ్చేస్తున్నాడు. సుప్రీమ్ స్టార్ సాయి ధ‌రమ్ తేజ్ త్వ‌ర‌లో వెండితెర‌పై సంద‌డి చేయ‌నున్నాడు. ఇటివ‌లే పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈమూవీ త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభంకానుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రానికి సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈచిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించ‌నున్నారు.

vaisnav-teja

తాజాగా ఈమూవీ నుంచి ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేశారు చిత్ర‌యూనిట్. ఫ‌స్ట్ లుక్ చూస్తే మాత్రం ఈమూవీ బెస్త‌వాళ్ళ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ తెర‌కెక్కుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా ఇందులో వైష్ణ‌వ్ బెస్తవాడిగా క‌నిపిస్తాడ‌ట‌. రంగ‌స్ధ‌లం చిత్రంమాదిరిగా ఈమూవీకి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తుంది. వైష్ణ‌వ్ తేజ్ సినిమాల్లో న‌టించ‌డం కొత్తేమి కాదు.

vainav tej film launch

గ‌తంలో ఆయ‌న శంక‌ర్ దాదా జిందాబాద్ చిత్రంలో పేషెంట్ గా న‌టించాడు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ జానీ సినిమాలో చిన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ గా న‌టించాడు. ఇప్పుడు ఫుల్ టైమ్ హీరోగా తెర‌పై క‌నిపించ‌నున్నాడు. ఇక ఈచిత్రానికి సినిమాటోగ్రఫర్ గా శ్యామ్ దత్, ఎడిట‌ర్ గా నవీన్ నూలి ఎంపికయ్యారు. వైష్ణ‌వ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా తెలుగు అమ్మాయిని తీసుకున్నారు.

- Advertisement -