ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా,నందమూరి ఫ్యామిలీ మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది. గతంలో మెగా ఫ్యామిలీని ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన వ్యాఖ్యలకు వరుస కౌంటర్ లు ఇస్తున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రస్తుతం ఈవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో మెగా అభిమానులు, నందమూరి అభిమానలు ఒకరికిఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. నాగబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు బాలకృష్ణ.
ఎన్టీఆర్ మూవీ ప్రమెషన్స్ లో భాగంగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆయన గురించి మాట్లాడేందుకు ఇది సమయం కాదని తెలిపారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానని చెప్పారు. ఇక తాజాగా వీరిద్దరి మధ్యలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యాడు.
కామెంట్లు చేయడంలో నన్ను మించిపోయారనే నా బాధ ఒకవైపు.. తన స్టార్ బ్రదర్స్‌ను సమర్థించడంలో సూపర్‌స్టార్ అయిపోయారనే ఆనందం ఒకవైపు.. ఒక కంట కన్నీరు, మరో కంట పన్నీరు. నాగబాబు గారూ హ్యాట్సాఫ్. మీ సోదరులను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం అని వర్మ ట్వీట్ చేశారు.