‘యాత్ర’ ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిధిగా జ‌గ‌న్..

165
Yatra Jagan

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత క‌థ ఆధారంగా యాత్ర సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం హైద‌ర‌బాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈచిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా తెరెక్కిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు మ‌హి. వి రాఘ‌వ్ ఈచిత్రినికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫిబ్ర‌వ‌రి 8న ఈమూవీని విడుద‌ల చేయ‌నున్నారు. నిన్న సాయంత్రం విడుద‌లైన ఈమూవీ ట్రైల‌ర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. దింతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Yatra Still

ఫిబ్ర‌వ‌రి 1వ తేదిన ఈచిత్ర ఫ్రి రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ వేడుక‌ను వైజాగ్ లో నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట చిత్రూయ‌నిట్. అయితే ఈవేడుక‌కి వైఎస్ జ‌గ‌న్ చీఫ్ గెస్ట్ గా రానున్న‌ట్లు తెలుస్తోంది. జగన్ తో పాటు ఆయన తల్లి .. భార్య ఇతర కుటుంబ సభ్యులు ఈ వేడుకకి హాజరు కానున్నట్టుగా సమాచారం.వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌లో మమ్ముట్టి .. విజయమ్మగా ఆశ్రిత వేముగంటి నటించారు. జ‌గ‌ప‌తిబాబు, సుహాసిని, అన‌సూయ ప‌లువురు ఈమూవీ కీల‌క పాత్ర‌లో న‌టించారు.