హుజురాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల..

44
Election Schedule

ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్ 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా అక్టోబర్ 30న పోలింగ్, నవంబర్ 2న కౌంటింగ్ నిర్వహించనున్నారు.

నామినేష‌న్ దాఖ‌లుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 8, కాగా 11వ తేదీన నామినేష‌న్ల‌ను పరిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 13.

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున విద్యార్థి నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నారు.