థర్డ్ ఫ్రంట్‌ వర్కవుట్ కాదు: ప్రశాంత్ కిశోర్

43
prashant

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఇవాళ భేటీ కానున్న నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన ఆయన… థ‌ర్డ్ లేదా ఫోర్త్ ఫ్రంట్ ఇప్ప‌టి ప్ర‌భుత్వాన్ని విజ‌య‌వంతంగా దించేలా ఎదుగుతాయ‌ని నేను అనుకోవ‌డం లేదు అని అన్నారు.

ఇప్పటి రాజకీయ పరిస్థితులకు ఇది సరిపోదని..పాత మోడల్‌ అన్నారు. ప్ర‌స్తుతానికైతే థ‌ర్డ్ ఫ్రంట్ అనేది వ‌ర్క‌వుట్ కాదు అని పీకే స్ప‌ష్టం చేశారు. అయితే బెంగాల్ ఎన్నికల అనంతరం ఎన్నికల వ్యూహకర్త పనికి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ కిశోర్…శరద్ పవార్‌తో పలుమార్లు భేటీ అయ్యారు.

ఇవాళ ప్రతిపక్షాల భేటీ జరగనున్న నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.