దళితులను ఇండస్ట్రీ నుండి గెంటేయండి:నటి వివాదాస్పద కామెంట్స్

116
meera
- Advertisement -

తమిళనటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక ద‌ళిత డైరెక్టర్‌ తన అనుమతి లేకుండా ఫొటోని దొంగిలించి పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు అని వీడియో షేర్ చేసిన మీరా… దళితులు క్రిమినల్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉంటారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడతారని వ్యాఖ్యానించారు.

షెడ్యూల్ కులాల వారి కారణంగానే అనవసరమైన గొడవలు, వివాదాలు వస్తున్నాయని తెలిపింది. తమిళ సినీ పరిశ్రమలో ఎవరైనా షెడ్యూల్ కులాల వారు ఉంటే వాళ్లు బయటకు వెళ్లిపోవాలని వారి వల్లే క్వాలిటీ సినిమాలు రావడం లేదని నీచమైన కామెంట్స్ చేశారు. దీనిపై అన్నివర్గాల ప్రజల నుండి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.

మీరాపై దళిత పక్షపాత పార్టీ వి ఎస్ కె ఈవిడ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు న‌మోదు చేశారు. 2016లో మిస్ సౌత్ ఇండియా కిరీటం అందుకున్న మీరా…2019 లో బిగ్ బాస్ తమిళ్‌లో పాల్గొని మ‌రింత పాపులారిటీ తెచ్చుకుంది.

- Advertisement -