ప్రభాస్‌తో మీనాక్షి చౌదరి..!

369
Meenakshi
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. భారీ బడ్జెట్ మూవీతో కన్నడ,తెలుగు భాషాలలో ఏకకాలంలో తెరకెక్కుతుండగా హిందీ, తమిళం, మలయాళంలో డబ్ చేస్తున్నారు. 2022 ఏప్రిల్ 14న సినిమా రిలీజ్ కానుండగా తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది.

ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా తాజాగా మరో హీరోయిన్‌ని తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తుండగా ఇటీవలె ఇచ్చట వాహనములు నిలుపరాదు నటించి మెప్పించింది. జగపతిబాబు సలార్ లో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో పాటుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ‘రాధే శ్యామ్’ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

- Advertisement -