త్వరలో కలుద్దాం: సాయిధరమ్

23
saidharam

తన ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా స్పందించారు మెగాహీరో సాయిధరమ్ తేజ్. నాపై మరియు నా చిత్రం “రిపబ్లిక్” పై మీ ప్రేమ, ఆప్యాయతను చూపించినందుకు నా కృతజ్ఞతలు.. త్వరలోనే కలుద్దాం’ అంటూ విక్టరీ సింబర్ సంకేతాన్ని చూపిస్తున్న ఫోటోను షేర్ చేశారు తేజ్.

సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. యాక్సిడెంట్ లో ఆయన కాలర్ బోన్‌లో ఫ్రాక్చర్ అయ్యింది. పలు శస్త్ర చికిత్సల అనంతరం సాయి ధరమ్ తేజ్ అపోలో ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.