కడుపుబ్బా నవ్వించే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’

329
Meelo Evaru Koteeswarudu Movie Review
- Advertisement -

హాస్యనటుడు పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. కామెడీ సినిమాల స్పెషలిస్ట్గా పేరు తెచ్చుకున్న ఇ సత్తిబాబు దర్శకత్వంలో సెటైరికల్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారిగా 30 ఇయర్స్ పృథ్వీ లీడ్ రోల్లో నటించారు. తొలిసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న పృథ్వీకి మీలో ఎవరు కోటీశ్వరుడు సక్సెస్ అందించిందా..? సత్తిబాబు, తన కామెడీ ఫార్ములాతో మరోసారి ఆకట్టుకున్నాడా..? లేదా చూద్దాం..

కథ:

మధ్య తరగతి హీరో నవీన్ చంద్ర… డబ్బున్న అమ్మాయి శృతీ సోధి.,, ఇద్దరు ప్రేమించుకుంటారు… డబ్బున్న అమ్మాయి తండ్రి పెళ్లి కి ఒప్పుకోడు. వ్యవసాయంచేసే నవీన్ చంద్ర కుటుంబానికి విమానాల్లో తిరిగే మురళీ శర్మ లాంటి కుటుంబానికి తగదని చెబుతాడు. దీంతో ఆనందం డబ్బులో లేదని… ఓసారి ఒడిపోయి గెలిస్తే ఆనందం అంటే ఏంటో తెలుస్తుందని చెప్పి చాలెంజ్ చేస్తాడు నవీన్ చంద్ర. దీంతో మరళీ శర్మ బాగా ఆలోచింది… నష్టపోయే వ్యాపారం చేయాలనుకుంటాడు. దానికి తగ్గట్టుగా ఐడియా చెబితే కోటి రూపాయలిస్తానని ప్రకటన ఇస్తాడు. ఆ ప్రకటన చూసి తాతారావు అనే ప్రొడ్యూసర్ (పోసాని).. సినిమా తీస్తే నష్టపోవడం ఖాయమని హామీ ఇస్తాడు. దాని కోసం ఫ్లాప్ సినిమాలు తీసే రఘుబాబుతో తమలపాకు అనే టైటిల్ తో వేరియేషన్ వీరబాబు (పృథ్వీ)ను పెట్టి సినిమా ప్రారంభిస్తాడు. హీరోయిన్ సమంత (సలోని). తమలపాకు సినిమా ఫ్లాప్ కావాలని తీస్తారు. కానీ తర్వాత ఏం జరిగింది..? ప్రశాంత్, ప్రియా ప్రేమకథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.

Meelo Evaru Koteeswarudu Movie Review

ప్లస్ పాయింట్స్:

సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కామెడీ, పృథ్వీ క్యారెక్టర్. సినిమా అంతా పృథ్వీనే హీరోగా కనిపిస్తాడు. తనకు బాగా అలవాటైన పేరడీ సీన్స్తో ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్తో పాటు పంచ్ డైలాగ్స్తోనూ అలరించాడు. సినిమాలు తీసి నష్టపోయిన నిర్మాత తాతారావు పాత్రకు పోసాని కృష్ణమురళి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. రఘుబాబు, పోసాని కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ కితకితలు పెడతాయి. ఇతర పాత్రల్లో మురళీ శర్మ, జయప్రకాష్ రెడ్డి, ప్రభాస్ శ్రీను, ధనరాజ్లు తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్:

సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా అనిపిస్తాయి.సినిమాలో సినిమా తీయాలనే ఆలోచన బాగున్నప్పటికీ… మెయిన్ టార్గెట్ ఏదైతే ఉందో అది అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. నష్టపోతే… ఆనందం దొరుకుతుంది.. అని హీరో చెప్పడం.. దానికి విలన్ ఫ్లాప్ సినిమా తీస్తా అనడం అంతగా మెప్పించలేదు.

Meelo Evaru Koteeswarudu Movie Review

సాంకేతిక నిపుణులు :

రెండు విభిన్న కథలను ఓకె కథలో చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు ఇ సత్తిబాబు ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రెండు కథలను కనెక్ట్ చేసిన తీరు కూడా బాగుంది. కామెడీ సినిమాలు తెరకెక్కించటంలో తిరుగులేదని ప్రూవ్ చేసుకున్న సత్తిబాబు, ఈ సినిమాతో పేరడీ కామెడీని కూడా బాగానే డీల్ చేశాడు. సినీ రంగం మీదే సెటైరికల్గా తెరకెక్కించిన కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్గా నిలిచాయి. వసంత్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతంతో తన మార్క్ చూపించాడు. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కాన్పెప్ట్ ను చాలా తెలివిగా ప్లాన్ చేసి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కామెడీ పంచులతో… సినిమా డైలాగులతో పృథ్వీ వేసే పంచులు నవ్వు తెప్పించాయి. పృథ్వీ నటన,పేరడి కామెడి సినిమాకు ప్లస్ కాగా…కొన్ని సాగదీసే సన్నివేశాలు సినిమాకు మైనస్ పాయింట్. మొత్తంగా లాజిక్కులు పక్కన పెట్టి కామెడీ ఎంజాయ్ చేయాలనుకునే వారికి మీలో ఎవరు కోటీశ్వరుడు నచ్చుతుంది. ముఖ్యంగా పృథ్వీ డైలాగ్స్ తో కడుపుబ్బ నవ్వుతూ ఎంజాయ్ చేయొచ్చు.

విడుదల తేదీ:16/12/16
రేటింగ్:3/5
నటీనటులు:పృథ్వీ, సలోని, నవీన్ చంద్ర, శృతిసోథి
సంగీతం : డిజె వసంత్
నిర్మాత : కె కె రాధామోహన్
దర్శకత్వం : ఇ. సత్తిబాబు

- Advertisement -