మొక్కలు నాటిన మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్..

143
Medchal Malkajgiri Collector

శనివారం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో నేడు కండ్లకోయ లోని జిల్లా అటవీ శాఖ నూతన కార్యాలయం ఆవరణంలో 108 మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై మొక్కలు నాటారు కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.