రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కమిషనర్ ఎం శ్రీనివాస్ గారు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మేడ్చల్ జిల్లా శామీర్ పెట్ , మిని స్టేడియం లో మొక్కలు నాటారు అడిషనల్ కలెక్టర్ శాంసన్.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మొక్కలు నాటి , వాటిని పెంచే బాధ్యత మనందరి మీద ఉంది . మేడ్చల్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించిన హరితహారం లో భాగంగా 2014 నుండి రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు ఎదిగి ఎంతో ఆహ్లదకర వాతావరణం నెలకొంది . మనం నాటే మొక్కలు మన భవిష్యత్ తరాలకు బంగారు బాట , మనకోసం మన ముందు తరం కష్ట పడ్డట్టు మనం చెట్లు విరివిగా నాటి పర్యావరణ పరిరక్షణకు మన వంతు సహాయం అందించాలని , ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని మరో ముగ్గురికి బి దేవా సహాయం జెడ్పి సీఈవో , పద్మజ రాణి డీపీవో మేడ్చల్ జిల్లా , అమరేందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ గుండ్లపోచంపల్లికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు