బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 76 హైలైట్స్

99
episode 76

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 76 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 76వ ఎపిసోడ్‌లో భాగంగా కెప్టెన్‌గా హారిక ఎంపికవడం,తన స్నేహితురాలు మోనాల్ గజ్జర్ వల్ల అఖిల్ తన కెప్టెన్సీని కోల్పోవడం,జున్నును చూసి లాస్య కంటతడి పెట్టడం వంటివి ఎపిసోడ్‌కు హైలైట్‌గా నిలిచాయి.

తొలుత క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి లాస్య భర్త మంజునాథ్‌, కొడుకు జున్ను ఎంట్రీ ఇచ్చారు. కొడుకుని చూడగానే లాస్య భోరున విలపించింది. ఏడ్చుకుంటూనే భర్తతో మాట్లాడింది. నువ్వు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నావు. నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉన్నావో నీ కన్నా ఎక్కువ స్ట్రాంగ్‌గా ఉన్నాడు జున్ను. అస్సలు ఏడ్వడం లేదు అని తెలిపాడు. తర్వాత ఇంటి సభ్యులందరూ లాస్య భర్తతో మాట్లాడుతూ ఆమెపై జోకులు వేశారు.

తర్వాత అరియానా, హారికలతో ఆటాడుకున్నాడు అవినాష్‌. చిన్న పిల్లలు స్కూల్‌కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారని ఆటపట్టించాడు. తమ అందాన్ని చూసి అవినాష్‌ కల్లు తిప్పుకోలేకపోతున్నాడని అరియానా అనగా.. అందం గురించి మనం మాట్లాడుకోవద్దని అవినాష్‌ పంచ్‌ వేశాడు. తర్వాత ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులకు క్విజ్‌ పోటీ పెట్టాడు బిగ్‌బాస్‌. గార్డెన్‌ ఏరియాలో రిఫ్రిజిరేటర్‌ను పెట్టి.. వారికి కావాల్సిన లగ్జరీ బడ్జెట్ ఐటమ్స్‌ను దానిలోపల ఉంచారు. క్విజ్‌ మాస్టర్‌గా అవినాష్‌ను పోటీదారులుగా సోహైల్‌, లాస్య, మోనాల్‌, అభిజిత్‌ను ఎంపికచేశాడు. సొహైల్ ఒకటి రెండు తప్పులు మినహా మిగితా వారు మాగ్జిమమ్ కరెక్ట్‌గా చెప్పి తమకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్‌ని తీసుకున్నారు.

ఇక క‌మాండో ఇన్‌స్టిట్యూట్‌ టాస్క్‌ స్టార్స్‌ సాధించిన అఖిల్‌, అభిజిత్‌, హారికలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు మిగతా ఇంటి సభ్యులను ఒప్పించి వారి భుజాల మీద కూర్చోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ సేపు కిందికి దిగకుండా భుజాల మీద ఉంటారో వాళ్లు ఇంటి కెప్టెన్‌ అవుతారని తెలిపారు. అవినాష్‌..అభిజిత్‌ను సొహైల్‌..అఖిల్‌ను…మోనాల్‌…హారికను ఎత్తుకుని నిలుచుకున్నారు. తొలుత అవినాష్‌ తర్వాత సొహైల్ ఔట్ కావడంతో హారిక కెప్టెన్‌గా ఎంపికైంది.

ఇక కెప్టెన్సీ టాస్క్‌ ఓడిపోయిన బాధలో ఉన్న అఖిల్‌ని సోహైల్‌ ఓదార్చాడు. తాను శాయశక్తులా కృషి చేశానని, తన టాస్క్‌లాగే ఆడానని, అయినా గెలవలేకపోయామని తెలిపాడు. అయితే తన ఓటమికి మోనాల్‌ని బాధ్యురాలిగా చేస్తూ కోపంతో ఉగిపోయాడు అఖిల్. మోనాల్‌ తనుకు హెల్ఫ్‌ చేస్తుందని భావించానని, కానీ తనను కాదని హారికకు సాయం చేసిందని చెబుతూ బాధపడ్డాడు. .

ఇక కెప్టెన్‌ అయిన హారికపై అభిజిత్‌ జోకులు వేశాడు. మోనాల్‌ ఎంత పని చేశావ్‌ అంటూ.. ఆమెను ఎందుకు కెప్టెన్‌ చేశావు ఆని హారికను ఆటపట్టించాడు.అయితే హారిక మాత్రం అభిజిత్‌కు గట్టిగానే ఇచ్చిపడేసింది. నా మీద జోకులు వేస్తే నేను ఊరుకోవాలి. నీ మీద వేస్తనేమో సీరియస్‌ అవుతావు. నేను జోకులు వేసినప్పుటు సీరియస్‌ కావాలి కానీ.. నీ పని చెప్తా చూడు అంటూ వార్నింగ్‌ ఇచ్చింది.