టీఆర్‌ఎస్‌.. అన్ని వర్గాల వారిగా అభ్యర్థుల జాబిత..

32
trs

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 85 డివిజన్లలో మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. నేడు తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదికను విడుదల చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారు. 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించాం. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించాం. అగ్రవర్ణాల వారికి కూడా న్యాయం చేశాం. ఎస్సీలకు 10 సీట్లే రిజర్వ్‌ అయినా 13 కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు అన్ని వర్గాల అభ్యర్థుల జాబితాను టీఆర్‌ఎస్ పార్టీ విడుదల చేసింది.