సమ్మక్క-సారక్క జాతర..తేదీలివే

652
sammakka sarakka jatara
- Advertisement -

గిరిజన కుంభమేళ,తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరిపే సమ్మక్క సారక్క జాతర ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 5న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోనుండగా… ఫిబ్రవరి 6న సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోనుంది. ఫిబ్రవరి 7న భక్తులు మొక్కులు చెల్లించుకోనున్నారు. ఫిబ్రవరి 8న సమ్మక్క-సారలమ్మ తిరిగి వన ప్రవేశం జరగనుంది.

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, ఒడిషా, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఆరంభంలో జరగనునన్న మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామని పూజారుల సంఘం ప్రకటించింది.

దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే సమ్మక్క సారక్క జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ‘తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందింది. గిరిజన సంప్రదాయాన్ని కళ్లకు కట్టే పండుగేఈ జాతర.

- Advertisement -