ఈటెల భూముల సర్వేను పరిశీలించిన కలెక్టర్..

106
- Advertisement -

ఈటెల రాజేందర్‌కు సంబంధించిన భూముల సర్వేను మెదక్ కలెక్టర్ హరీష్ గురువారం పరిశీలించారు. మాసాయిపేట మండలం అచ్చంపేటలో సర్వే పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు కలెక్టరేట్. ఆర్డీవో శ్యాం ప్రసాద్, తాహసిల్దార్ మాలతిని సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తయ్యే వరకు సంయమనం పాటించాలని రైతులకు సూచించారు కలెక్టర్. సర్వే పూర్తయ్యాక రిపోర్ట్ ఇస్తామని, హద్దులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే చెపట్టామని కలెక్టర్‌ తెలిపారు. ఈ మేరకు జమున హార్చరీస్ కోర్టును ఆశ్రయించారు. అయితే జమున హార్చారీస్ కోరిక మేరకు కోవిడ్ కారణంగా సర్వే వాయిదా పడింది. ప్రొసీజర్ ప్రకారం చేయాలనే కోర్టు ఆదేశాల మేరకు సర్వే ప్రారంభమైంది. అసైన్డ్ చేసిన రైతుల నోటీసులు ఇచ్చి సర్వే స్టార్ట్ చేసాము. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సర్వే చేస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. అచ్చంపేట, హక్కింపేట్ పరిధిలో సర్వే ప్రారంభమైంది. నిన్న కలెక్టరేట్ కి కొందరు రైతులు వచ్చారు. త్వరగా సర్వే పూర్తి చేసి న్యాయం చేయాలని కోరారు. కచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చామన్నారు కలెక్టర్‌.

సర్వేలో సీలింగ్ లాండ్, అసైన్మెంట్ లాండ్, పట్టా భూమి ఎంత అనేది ఖచ్చితంగా తేలుస్తాం. త్వరగా సర్వే పూర్తి చేసి న్యాయం చేస్తాము అన్నారు. 1995 హౌస్ కమిటీ సర్వే నిర్వహించారు, ఒరిజినల్ టీపన్, సర్వే స్కెచ్ మ్యాప్ ఉంది. గ్రౌండ్ సర్వే తర్వాత, క్యాడ్‌లో వర్కౌట్ ఉంటుందని కలెక్టర్ హరీష్‌ తెలిపారు.

- Advertisement -