స్వరాష్ట్రంలో కాళోజీకి సముచిత గౌరవం:శ్రీనివాస్ గౌడ్

136
srinivas goud

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ప్రజాకవి, పద్మవిభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి 106 వ జయంతిని పురస్కరించుకుని రవీంద్రభారతిలో ఘనంగా నివాళులర్పించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు గారి జయంతి ని తెలంగాణ భాషా దినోత్సవం గా అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి V. శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ కు చెందిన వైతాళికులను, మహనీయులను, వాగ్గేయ కారులను, కవులను, సాహితీవేత్తలను, ప్రముఖులను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గుర్తించి వారి జయంతి, వర్ధంతి మరియు వారి గుర్తుగా ఎన్నో కార్యక్రమాలను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు.

ప్రజాకవి శ్రీ కాళోజీ గారి స్ఫూర్తి ని సీఎం కేసీఆర్ గారు కొనసాగిస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కు చెందిన వైతాళికులను, మహానుభావులను, కవులను మరియు సాహితీవేత్తలను నిర్లక్ష్యం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత దాశరథి, చాకలి ఐలమ్మ, కొమర్రం బీమ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మరియు సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి మరెందరో మహానుభావులందరిని అధికారికంగా స్మరించుకుంటున్నామన్నారు.ప్రజాకవి కాళోజీ ఆనాటి పాలకులకు, వారి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వారి అనుసరిస్తున్న విధానాలపై కలం ఎక్కుపెట్టి ప్రజలను చైతన్య పరచడానికి వారికి అర్థమయ్యే భాషలో కవిత్వాన్ని, కథలను, పాటలను రచించారన్నారు. స్వతంత్ర సమరయోధులు గా, తెలంగాణ ఉద్యమం నాయకుడిగా ఎంతో మంది ఉద్యమకారులకు స్ఫూర్తి గా నిలిచారన్నారు.

పుట్టుక నీది, చావు నీది బతుకంతా దేశానిది అని ఇచ్చిన పిలుపు ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమ కారులకు స్ఫూర్తి నిచ్చిందన్నారు. కాళోజీ రచించిన రచనలు ఎంతో మందిని కదిలించాయన్నారు. ఒక్క సిరా చుక్క లక్షలాది మెదడ్లను కదిలించిన మాదిరిగా కాళోజీ రచనలు ఉద్యమాలకు ఊపిరి గా నిలిచిందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ కి గౌరవం గా కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ గా నామకరణం చేసి ప్రభుత్వం గౌరవించిందన్నారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డ్ ను ఇచ్చి గౌరవించారన్నారు శ్రీనివాస్ గౌడ్.ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి KS శ్రీనివాస రాజు, రాష్ట్ర సహకార వినియోగదారుల ఫెడరేషన్ చైర్మైన్ గట్టు తిమ్మప్ప, టూరిజం MD మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ లు పాల్గొన్నారు.