MEA:నేపాల్‌లో గల్లంతైన భారతీయుల లిస్ట్

5
- Advertisement -

నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భయాన్క జలప్రళయం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విపత్తులో కనీసం 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 105 మంది భారతీయ పౌరులు, 37 మంది ఎన్ఆర్ఐలతో (NRI) సహా దాదాపు 480 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో చాలామంది కైలాస మానససరోవర్ యాత్రకు వెళ్లిన భక్తులు, గోసాయికుండ్ లేక్ ట్రెక్కింగ్ పర్యాటకులు మరియు స్థానిక జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది.

నేపాల్ టూరిజం బోర్డు సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం గల్లంతైన విదేశీ పర్యాటకులలో భారతీయులతో పాటు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, మలేషియా దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు.

త్రిశూలి, రసువా ప్రాజెక్టులపై దెబ్బ: నేపాల్‌లోని రసువా జిల్లాలో ఉన్న త్రిశూలి జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న దాదాపు 60 మందికి పైగా కార్మికులు మరియు సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి. వరద ఉధృతికి సుమారు 60 కిలోమీటర్ల మేర రహదారులు, కమ్యూనికేషన్ టవర్లు మరియు బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. దట్టమైన బురద పేరుకుపోవడంతో రెస్క్యూ హెలికాప్టర్లు దిగడానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

కాఠ్మండులోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని పర్యవేక్షిస్తూ బాధితుల కుటుంబాల కోసం అత్యవసర ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసింది: +977 985 131 6807, +977 970 910 7500.

Also Read:క్రీడలకు మరింత ప్రాధాన్యం:మోదీ

చైనా సరిహద్దు సమీపంలోని భోటే కోషి నది ఉపనది అయిన లెంధే ఖోలా ప్రాంతంలో భూకంపం (మగ్నిట్యూడ్ 4.4) సంభవించడం వల్ల కొండచరియలు, హిమానీనదాలు విరిగిపడి సహజ సిద్ధమైన అడ్డుకట్ట ఏర్పడింది. ఆ కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో దిగువ ప్రాంతాలకు ప్రచండ వేగంతో నీరు, దట్టమైన బురద ప్రవహించి ఈ జలప్రళయానికి దారితీసింది.

- Advertisement -