కరోనాను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి ఒక్కరినీ శ్లాఘిస్తూ, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ.. ప్రముఖ నటుడు లోహిత్ రూపొందించిన వీడియో సాంగ్‌ను హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ గురువారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ బోర్డ్ సభ్యులు ఎస్. రాఘవ తదితరులు పాల్గొన్నారు.
“కరోనా మహమ్మారి మనల్ని వణికిస్తున్న సమయంలో నేనున్నాను అని భరోసా కల్పించిన ముఖ్యమంత్రి కేసిర్‌కి ధన్యవాదాలు. వారిచ్చిన దిశానిర్దేశంతో ముందుకు కదిలిన ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మేయర్ బొంతు రామ్మోహన్, జీఎస్ఎంసి కార్పోరేటర్లు, పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా ప్రాణాలను లెక్కచేయక అన్ని రకాలుగా ప్రజలను ఆదుకుంటూ, చైతన్యపరుస్తూ, మాస్క్ లు ధరింప చేస్తూ, సామాజిక దూరం పాటించడం గురించి వివరిస్తూ ముందుకు కదిలారు.
వీరిలో చాలా మందితో నాకున్న సాన్నిహిత్యంతో దగ్గరగా చూసిన వాడిగా ఈ స్పూర్తిగీతాన్ని నా మిత్రులు ప్రణయ్ కుమార్ మరియు ఉజ్వల్, వీడియో ఫ్రేమ్స్ సహకారంతో నిర్మించి ప్రజాప్రతినిధులకు, పోలీసు శాఖకు, డాక్టర్ లకు, ఇతర ప్రత్యేక సిబ్బందికి అంకితము ఇస్తున్నాను” అని లోహిత్ అన్నారు.