మాయవన్..పవర్ ప్యాక్ షెడ్యూల్‌ పూర్తి

20
- Advertisement -

హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌ జెడ్/మాయవన్‌ తర్వాత సెకండ్ పార్ట్ కోసం రెండవసారి చేతులు కలిపారు. ‘మాయవన్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తన ఫస్ట్ పవర్ ప్యాక్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. సందీప్ కిషన్, నీల్ ఇద్దరూ ఈ సినిమాలో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలలో కనిపించదానికి కొత్తగా మేక్ఓవర్ అయ్యారు.

మాయావన్‌లో సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు ఓటీటీ సిరీస్‌లలో నటించిన ఆకాంక్ష మాయావన్‌తో వెండితెర ఎంట్రీ ఇస్తోంది.

టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది. ఈ చిత్రానికి కార్తీక్ కె తిల్లై డీవోపీ గా పని చేస్తుండగా, సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read:INDvsENG :ఇంగ్లాండ్ చరిత్ర తిరగరాస్తుందా?

- Advertisement -