Birthday:తొలి సిక్కు రాష్ట్రపతి జైల్ సింగ్‌

104
- Advertisement -

భారత ప్రజాస్వామ్య దేశంలో మెజార్టీ మైనార్టీ అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. అలాంటి అవకాశంను అందిపుచ్చుకొని తనదైన శైలిలలో ప్రజాసేవకై అంకితమైన నేత జ్ఞాని జైల్ సింగ్‌. ఈయన మే5, 1916లో భాయ్ కిషన్ సింగ్‌ అనే వ్యక్తికి పంజాబ్‌లోని పరీద్‌కోట్‌ సంస్థానంలో జన్మించారు. ఈయన పేరు జైర్నల్ సింగ్.

భారత స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ అశువులు బాసిన తర్వాత చురుకైన వ్యక్తిగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అతను 1938లో ఫరీద్‌కోట్‌లో కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ప్రజా మండల్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే ఇలాంటివి నచ్చని ఫరీద్‌కోట్‌ సంస్థానం జైర్నల్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. ఐదు సంవత్సరాల జైలు జీవితం తర్వాత విడుదలైన జైర్నల్ సింగ్‌..ఇక అప్పటి నుంచి జైల్ సింగ్‌గా పేరు మార్చుకున్నారు. ఈయన పాటియాలా మరియు తూర్పు పంజాబ్ స్టేట్స్ యూనియన్‌లో మంత్రిగా నియమితులయ్యారు.

1956 నుండి 1962 మధ్య, సింగ్ రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. 1972 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి అతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 1977లో ఇందీరా గాంధీ ప్రభుత్వం పడిపోయినప్పటి నుంచి రాష్ట్రపతిగా ఎన్నికయ్యే నాటికి ఇందిరాగాంధీకి అన్ని విధాలుగా మద్దతునిచ్చారు. అంతేకాదు ఆయన్న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సేవలు అందించారు.

Also Read: కార్ల్ మార్క్స్…జయంతి

1982లో జ్ఞాని జైల్ సింగ్ భారతదేశానికి ఏడవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంతేకాదు తొలి సిక్కు రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. అయితే ఇదే సమయంలో పంజాబ్‌లో ఖలీస్థాని ఏర్పాటువాదం బలపడడంతో దేశవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి. అలాంటి సమయంలో ప్రభుత్వంను నడిపించడంలో ముందున్నారు. ప్రధాని ఆదేశాల మేరకు సైన్యం గోల్డెన్ టెంపుల్‌పై దాడి చేశారు. అయిన ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా తన విధులను చక్కగా నిర్వర్తించారు. 1994 నవంబర్‌లో చండీగఢ్‌లో కారు ప్రమాదంకు గురై తీవ్రంగా గాయపడ్డారు. ఒక నెల తర్వాత తుదిశ్వాస విడిచారు.

Also Read: బుద్ధుడు చూపిన మార్గం… నేటికి స్పూర్తిదాయకం

- Advertisement -