కార్ల్ మార్క్స్…జయంతి

93
- Advertisement -

పేదరికం ఉన్నంత కాలం, పెట్టుబడి దారి సమాజం ఆధిపత్యం ఉన్నంతకాలం, మనుషుల మధ్య తారతమ్యాలు,ఆధిపత్య పోరాటాలు ఉన్నంత కాలం ఈ లోకంలో సజీవంగా ఉంటాడు కార్ల్ మార్క్‌. బతికింది 64 ఏళ్లు అయినా ఇప్పటికి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహానీయుడు మార్క్స్. పుట్టింది జర్మన్‌లో అయినా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక కథనం.

మతం మత్తు మందు,పోరాడితే పోయేది ఏముంది బానిస సంకెళ్ళు తప్ప,మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చాటి చెప్పిన మహానీయుడు.ఆధునిక సామాజిక శాస్త్ర నిర్మాతాల్లో ఒకడిగా కోట్లాది మందికి ఆయన రాసిన గ్రంధాలు ఆదర్శంగా నిలిచాయి.

1818 మే 5 జన్మించారు మార్క్స్‌. పుట్టింది ఓ మధ్య తరగితి కుటుంబంలోనే అయినా సమాజాన్ని ఆ కాలంలోనే చదవిన మహా మేధావి. అందుకే ఆయన రాసిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ కాపిటల్ ఈ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటి బైబిల్ కాగా రెండోది కమ్యూనిస్ట్ మేనిఫెస్టో.

ప్రజాస్వామ్యమే సోషలిజానికి మార్గం, ప్రపంచకార్మికులారా పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అని పిలుపునిచ్చాడు. మార్క్స్ రచనలు సోవియట్ రష్యా, చైనా, తూర్ప యూరప్ లలోని రాజకీయ నాయకులను అమితంగా ప్రభావితం చేశాయి. 1864 సంవత్సరంలో కార్మికసంఘం స్థాపించి శ్రామిక జనోద్ధారణకు పాటుపడ్డాడు. రష్యన్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ఆవిర్భావం ఇందుకో ఉదాహరణ.

Also Read:Harishrao:రాజ్యాంగంలో రాసుందా?

వర్గ పోరాటం ద్వారానే, చివరకు కార్మికవర్గం మొత్తం ప్రపంచమంతటా బూర్జువా వర్గాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని వివరించారు.ప్రపంచీకరణ తొలి విమర్శకుడు మార్క్సే. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న అసమానతలపై ఆయన ఆనాడే హెచ్చరించారు. 2007-08లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక మాంద్యం ఆయన సిద్ధాంతాల ప్రాసంగికతను మరోసారి రుజువు చేశాయి.

మాంద్యం పదే పదే పునరావృతమవుతుందనీ, దానికి కారణాలు పెట్టుబడిదారీ విధానంలోనే ఇమిడి ఉన్నాయని మార్క్స్ చెప్పారు.పెట్టుబడిదారీ విధానం అంతరించి పోయేదాకా ఇలాగే జరుగుతుందని మార్క్స్ సూత్రీకరించారు.పెట్టుబడి అంతా కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది. దీని వల్ల నిరుద్యోగం పెరుగుతుంది. వేతనాలు పడిపోతుంటాయి. దీన్ని మనం నేటికీ చూస్తూనే ఉన్నాం.

Also Read:బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్.. హైలైట్స్‌

- Advertisement -