కామన్వెల్త్ డే

48
- Advertisement -

రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యం నుంచి పుట్టుకొచ్చిందే కామన్వెల్త్‌ దినోత్సవం. ప్రతి సంవత్సరం మే24న కామన్వెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. దీనిని మొదట 1901 జనవరి 22వ తేదీన క్వీన్ విక్టోరియా మరణించిన తర్వాత ఆమె గౌరవార్థం 1902లో స్థాపించారు. అయితే తదుపరి సంవత్సరంలో మే 24 క్వీన్ విక్టోరియా పుట్టినరోజుతో సమానంగా కామన్వేల్త్ డేగా ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే దీనిని మొదట్లో ఎంపైర్‌ డేగా పిలవడం మొదలు పెట్టారు.

రెండవ ప్రపంచ యుద్దం తర్వాత బ్రిటీష్‌ సామ్రాజ్యం క్రమంగా తన ప్రాధాన్యతను కొల్పోతూ…వివిధ దేశాలు స్వతంత్రతను ప్రకటించుకున్నాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. అయితే యూనైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రిగా ఉన్న హెరాల్డ్ మెక్‌మీలన్ 1958లో కామన్వెల్త్ దేశాల మధ్య సంబంధాలల్లో మారుతున్న ప్రస్తుత రాజకీయా అవసరాల దృష్ట్యా ఎంపైర్‌ డేను కామన్వెల్త్ డేగా పేరు మార్చారు. ఈ పేరు మార్పుతో కామన్వెల్త్ యొక్క అభివృద్ధి చెందుతున్న స్వభావాన్ని మరియు దాని సభ్య దేశాల మధ్య సంబంధాలను మరింతగా ప్రతిబింబించేలా ఉండాలన్నారు.

Also Read: నూతన పార్లమెంట్‌ ఓపెనింగ్‌కు విపక్షాలు బాయ్‌కట్‌

కామన్వెల్త్‌ దేశాల 2.5బిలియన్ పౌరుల భాగస్వామ్య విలువలు మరియు సుత్రాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2023వ సంవత్సరానికి గాను శాంతియుత మరియు ఉమ్మడి భవిష్యత్తును ఏర్పరచడం అనే థీమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 54 కామన్వెల్త్ దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అంతేకాదు ఒలంపిక్ గేమ్స్ మాదిరిగానే కామన్వెల్త్‌లో సభ్యత్వం కలిగిన దేశాలు కలిపి కామన్వెల్త్‌ గేమ్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. అయితే గతంలో భారతదేశంలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌ కుంభకోణం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మాయని మచ్చలా మిగిలిపోయింది.

Also Read: రాగిపాత్రలతో ఆరోగ్యం..

- Advertisement -