రాజకీయంగా ఎదగాలంటే ఒకటి కంటే అనేక పార్టీలు ఉన్న ఈ దేశంలో కేవలం రెండు పార్టీలు మాత్రమే అధికారం మార్చి మార్చి పంచుకుంటాయి. ఆ రాష్ట్రం ఎదో తెలుసా..!తమిళనాడు. అక్కడ ఉన్న కేవలం రెండు పార్టీలు ఒకటి డిఎంకే రెండవది అన్నాడిఎంకే. అయితే సాధారణ పశువుల కాపరి కుటుంబం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు ఇతరులకు మార్గదర్శిగా కనపడుతుంది. ఆతన్నే పళనస్వామి పూర్తిపేరు ఎడప్పాడి కరుప్ప పళని స్వామి.
ఈయన 1954 మే 12న మద్రాస్ రాష్ట్రంలోని సేలంలోఇ సిలువంపాళయంలో జన్మించారు. ఈయన గ్రాడ్యుయేషన్ పూర్తి కాకముందే రాజకీయంలో అరంగేట్రం చేశారు. విద్యార్థి నాయకుడిగా ఉంటూ 1974లో అన్నా డీఎంకే వాలంటీర్‌గా రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలో సేలం జిల్లాలో అత్యంత ప్రభావంతమైన నాయకులులో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి 1989లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. అన్నాడిఎంకే లో అంచెలుంచెలుగా ఎదిగి 2007లో ఆర్గనైజేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు.
Also Read: అగ్నివీర్‌లకు రైల్వేలో రిజర్వేషన్ సడలింపు..!
అన్నా డిఎంకే పార్టీ అధికారంలోకి రావడంలో తనదైన శైలిలో పనిచేసి ప్రభుత్వంను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర వహించారు. జయలలితకు అత్యంత సన్నిహిత వర్గంలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. 2016లో అధికారంలోకి రావడంలో ఈయన పాత్ర కీలకమైంది. అనంతరం జయలలిత మరణాంతరం 2017లో తమిళనాడు సీఎం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు జయలలిత కెబినెట్‌లో హైవేలు మరియు మైనర్ పోర్టుల మంత్రిగా పనిచేశారు. ఈయన 2017 నుంచి 2021వరకు 7వ సీఎంగా తమిళనాడుకు సేవలందించారు. ప్రస్తుతం ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
Also Read: రచ్చ లేపుతున్న మహారాష్ట్ర రాజకీయం !