ఈ నెల 29వ తేదీన మౌని అమావాస్య రానుంది.కుంభమేళా జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి.మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఈ దినాన మౌనదీక్ష పాటించాలి. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండాలి. మహాశివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు.ఈ సమయంలో పుణ్య స్నానమాచరిస్తే ఎన్నోజన్మల పుణ్యం లభిస్తుంది.
మాఘ మాస అమావాస్య తిథి జనవరి 28న రాత్రి 7.32 గంటలకు ప్రారంభమై జనవరి 29న సాయంత్రం 6.05 గంటలకు ముగుస్తుంది.29 జనవరి 2025 అమావాస్య తిథి, బ్రహ్మ ముహూర్తం ఉదయం 5.30 నుంచి 6.21 వరకు, 29 జనవరి 2025 అమావాస్య తిథి లాభ చోఘడియ ఉదయం 7.11 గంటలకు,అమృత్ చోఘడియా : ఉదయం 8.31 నుండి 9.53 వరకు,11:13 నుండి 12:35 వరకు శుభ చోఘడియ.
అమృత స్నానానికి శుభసమయం ఉదయం 5.25 నుంచి 6.18 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉదయం, సాయంత్రం 5.51 గంటల నుంచి 7.11 గంటల వరకు ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తంలో భక్తులు గంగాస్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది. మౌని అమావాస్య రోజున గంగ లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి. మీరు ఏ నదిలోనైనా స్నానం చేయలేకపోతే ఇంట్లో గంగాజలం వేసి స్నానం చేయండి.
Also Read:U-19 World Cup: చరిత్ర సృష్టించిన గొంగడి త్రిష