యాదాద్రి మహాసంకల్పానికి రెండేళ్లు…

248
- Advertisement -

తెలంగాణ తిరుమలగా యాదాద్రిని చేయాలనే కృతనిశ్చయానికి నేటితో రెండేళ్లు. సరిగ్గా 2014 అక్టోబరు 17న ఆ మహాసంకల్పానికి కార్యరూపమిచ్చారు సీఎం కేసీఆర్. ఆ రోజు యాదగిరిగుట్ట నరసన్నను దర్శించుకున్న ఆయన.. హెలికాఫ్టర్ లో గుట్ట పరిసరాలను పరిశీలించారు. యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి.. ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వైటీడీఏ) ఏర్పాటు చేయడమే కాకుండా.. ప్రతి విషయాన్ని స్వయంగా పరిశీలిస్తున్నారు సీఎం. వచ్చే ఏడాది దసరా కల్లా యాదాద్రి నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చకచకా పనులు సాగుతున్నాయి.

temple-towns-

2015 దసరా రోజున యాదాద్రి టెంపుల్‌ సిటీ పనులకు శంకుస్థాపన జరిగింది. ఆలయ నమూనాపై వెయ్యి రకాల డిజైన్లు రూ పొందిన తర్వాత ఫైనల్ డిజైన్లకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఏటా బడ్జెట్‌లో 100 కోట్ల చొప్పున కేటాయిస్తుండడంతో యాదాద్రిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి ఆలయ అభివృద్ధి గురించి సమైక్య రాష్ట్రంలో పాలకులు ఎవరూ పట్టించుకోలేదు. కోట్లాది రూపాయల ఆలయ ఆదాయాన్ని ఆంధ్ర దేవాలయాల అభివృద్ధికి మళ్లించారు. ఆనాటి వివక్షపై సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. కోరిన కోర్కెలు తీర్చే శ్రీలక్ష్మీనరసింహునికే కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్న అపూర్వ సన్నివేశం అందరినీ అబ్బురపరుస్తోంది.

Yadadri

యాదాద్రి పనులు ప్రారంభానికి ముందు ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రధాన ఆలయంలో పూజలు నిలిపేశారు. భక్తుల దర్శనానికి ప్రత్యేకంగా బాలాలయాన్ని ప్రతిష్టించారు. త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆల‌య ప్ర‌తిష్టాప‌న కార్య‌క్ర‌మం జరిగింది.

Yadadri_temple

యాదాద్రి అభివృద్ధి పనులు:

()టెంపుల్ సిటీగా యాదాద్రి
() లే అవుట్లు, డిజైన్లను స్వయంగా పరిశీలించిన సీఎం
() టెంపుల్ సిటీకి 850 ఎకరాలు కేటాయింపు
()కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కులు, ఫుట్ పాత్ లు, ఫుడ్ కోర్టులు, ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు
() కార్పొరేట్ కంపెనీలకు యాదాద్రి కాటేజీల నిర్మాణ పనులు
()కాటేజీల నిర్మాణానికి వెయ్యి నుంచి 15 వందల గజాల ఓపెన్ ప్లాట్లు
()ప్రధాన ఆలయానికి వెళ్లేందుకు , వచ్చేందుకు రెండు వేర్వేరు రోడ్లు

Yadadri_Temple

Yadagirigutta

- Advertisement -