హ్యాపీ బర్త్ డే టు ‘చంద్రముఖి’

238
- Advertisement -

ఈ తరం నటీమణులకు స్ఫూర్తిగా నిలిచే ప్రముఖ హీరోయిన్లలో జ్యోతిక ఒకరు. ఇప్పటి ప్రముఖ నాయికలకు ముందు ఒక వెలుగు వెలిగిన నటి జ్యోతిక. టాప్ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే నటుడు సూర్యను ప్రేమించి పెళ్లాడిన జ్యోతిక ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు.ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక…చాలా కాలం గ్యాప్ తర్వాత వెండితెరపై రీఎంట్రికి రెడీ అయింది. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా greattelangaana.com ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

surya

నగ్మా సోదరిగా సినీరంగప్రవేశం చేసి తమిళనాట అగ్రశ్రేణి కథానాయికగా ఎదిగిన జ్యోతిక…ముంబయిలోని లెర్నర్స్‌ అకాడమీలో జ్యోతిక స్కూలింగ్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత మీతీబాయ్‌ కళాశాలలో సైకాలజీ చేశారు. జ్యోతిక తమిళంలో అగ్రకథానాయికగా పేరుతెచ్చుకున్నా.. సినిమా రంగంలోకి ప్రవేశించింది మాత్రం ‘డోలీ సాజ్‌నాకే రఖ్‌నా’ చిత్రంతో. ప్రియదర్శన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

surya-happy-family

1999లో అజిత్‌తో కలిసి వాలి చిత్రంలో జ్యోతిక అతిథి పాత్రలో నటించారు. ఆ తర్వాత సూర్య నటించిన ‘పూవెళ్లం కెట్టుప్పర్‌’ చిత్రంలో నటించారు. కానీ జ్యోతికకు కమర్షియల్‌ హిట్‌ ఇచ్చిన చిత్రం తమిళ ‘ఖుషి’. ఈ చిత్రానికి గానూ జ్యోతిక ఉత్తమ తమిళ నటిగా ఫిలింఫేర్‌ అందుకొన్నారు. 2000 నుంచి 2002 వరకు జ్యోతిక నటించిన చిత్రాలు బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి. 2005లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో కలిసి ‘చంద్రముఖి’ చిత్రంలో టైటిల్‌ రోల్‌లో నటించారు జ్యోతిక. ‘చంద్రముఖి’తో ఇటు తెలుగు, అటు తమిళంలో ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతకుముందు ఠాగూర్‌, మాస్‌ సినిమాల్లో నటించినా లకలకలక.. అంటూ అందరికీ చేరువైంది మాత్రం ‘చంద్రముఖి’తోనే.

jyothika

జ్యోతిక ప్రముఖ నటుడు సూర్యని ప్రేమ వివాహం చేసుకున్నారు. 1999లోవీరిద్దరూ కలిసి నటించిన ‘పూవేళ్లాం కెట్టుపర్‌’ చిత్రీకరణలో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 2006 సెప్టెంబర్‌లో సూర్య, జ్యోతికలు పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇప్పుడు వీరిద్దరికీ పాప దియా, బాబు దేవ్‌లు ఉన్నారు. జ్యోతిక ప్రస్తుతం బ్రహ్మ దర్శకత్వంలో ‘మగలిర్‌ మత్తుమ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. జ్యోతిక మరిన్ని విజయవంతమైన చిత్రాలతో మన ముందుకు రావాలని కోరుకుంటూ మరోసారి greattelangaana.com పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

- Advertisement -