వరంగల్‌ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌…

274
- Advertisement -

తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ వస్తే భద్రకాళి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటానని తాను అమ్మవారికి మొక్కుకున్నానని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ వచ్చింది కనుక ఇవాళ మొక్కు చెల్లించుకున్నానని పేర్కొన్నారు. ఇవాళ ఆయన సతీసమేతంగా వచ్చి అమ్మవారికి రూ.3.7 కోట్లతో చేయించిన 11.7 కిలోల బంగారు కిరీటం సమర్పించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ మూల నక్షత్రం కనుకు అమ్మవారికి ఇష్టమైనరోజని, పైగా నవరాత్రులు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

దసరా, సద్దుల బతుకమ్మ సందర్భంగా వరంగల్ వేదికగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బంగారు తెలంగాణ దిశగా పయనిద్దామని పిలుపునిచ్చారు. జిల్లాల విభజనపై విపక్షాలు అనవసర రాద్దాంత చేస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు.ప్రజాసంక్షేమం కోసమే జిల్లాల ఏర్పాటని స్పష్టంచేశారు.కొత్త జిల్లాలకు ప్రముఖుల పేర్లు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. బంగారు తెలంగాణ దిశగ రాష్ట్ర ప్రభుత్వం పయనీస్తోందని తెలిపారు.

kcr

31 జిల్లాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. వరంగల్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. దసరా తర్వాత వరంగల్ ప్రతినిధులతో భేటీ అవుతానని వెల్లడించారు. జిల్లాల విభజనపై శాస్త్రీయత అంటే ఏమిటో తెలపాలని సీఎం విపక్షాలను ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అందాలన్నారు. వరంగల్‌కు వెయ్యి కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఈ సారి ఇసుక మీద ఆదాయం వెయ్యికోట్లు వస్తుందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్ మినహా మిగితా ప్రాజెక్టులన్ని నిండాయని వెల్లడించారు.అమ్మవారి దయతో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని కేసీఆర్ స్పష్టం చేశారు. జనాభ తక్కువగా ఉన్న చోట పాలన అద్భుతంగా ఉంటుందని తెలిపారు.

kcr warangal

అంతకముందు వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి సీఎం దంపతులుస్వర్ణకిరీటం సమర్పించారు. సతీసమేతంగా ఆలయానికి చేరున్న సీఎం దంపతులకు వేదపండితులు పూర్ణకుంభం,వేదమంత్రాలతో స్వాగతం పలికారు. రూ. 3 కోట్ల 70 లక్షలతో తయారు చేయించిన 11.7 కిలోల స్వర్ణకిరీటాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం తరపున అమ్మవారికి సమర్పించారు.

kcr

- Advertisement -