స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి..

223
- Advertisement -

స్వచ్ఛ తెలంగాణ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు.నగరంలోని హైటెక్స్ సైబర్‌సిటీ కన్వన్షన్ సెంటర్‌లో నేడు స్వచ్ఛ భారత్‌పై అవగాహన సదస్సు లో మాట్లాడిన కేటీఆర్….ఆరోగ్యవంతమైన సమాజంతోనే దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. స్వచ్ఛ భారత్‌ అనేది ప్రభుత్వ కార్యక్రమం కాదని…ప్రజలందరు స్వచ్ఛందంగా పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. స్వచ్ఛ భారత్ స్పూర్తిగా స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి చేస్తామని తెలిపారు.

2019 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా భారత్ నిలవాలని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్ఛ భారత్‌పై అవగాహన కోసం దేశవ్యాప్తంగా 4,500 లఘచిత్రాలు వచ్చాయని…వచ్చిన వాటిలో 17 లఘచిత్రాలను అత్యుత్తమమైనవిగా ఎంపిక చేశామని తెలిపారు. ఎంపిక చేసిన లఘచిత్రాలతో స్వచ్ఛభారత్‌పై ప్రచారం కల్పిస్తామన్నారు. స్వచ్ఛభారత్ రాజకీయ కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం కాకూడదని ప్రధాని చెప్పారు.

స్వచ్ఛభారత్ కార్యక్రమం ప్రజల హృదయాల్లోకి వెళ్లిపోయిందని…. స్వచ్ఛతపై ఆలోచన రేకెత్తించేలా లఘుచిత్రాలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా గాంధీజీ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఏ రోజు పని ఆరోజే ముగించుకోవాలి, వాయిదాలు వేయకూడదని ఆయన పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్,తనికెళ్ల భరణి, అల్లు అరవింద్, సుద్దాల అశోక్‌తేజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -