వినాయక్‌కి చిరు గిఫ్ట్‌

223
- Advertisement -

తన సోదరులైన నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో దర్శకుడు వివి వినాయక్ కూడా అంతేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆదివారం నాడు వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. వీవీ వినాయక్ తనకు సోదరుడి వంటి వాడని, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎంతో వినాయక్ కూడా అంతేనని చెప్పారు. తనను ఎంతో వినయంగా అన్నయ్యా అని పిలిచే వినాయక్, పది మందికీ సాయపడాలని భావించే గుణమున్న వ్యక్తని, అదే తన్ను చాలా ఇంప్రెస్ చేసిందని వెల్లడించారు.

ఓ దర్శకుడిగా కన్నా, వ్యక్తిగా తనకెంతో నచ్చిన వ్యక్తని కొనియాడారు. మేకింగ్ విజువల్స్తో పాటు మెగాస్టార్ నుంచి డ్రైవర్ వరకు అందరూ వినాయక్కు శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందించిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఖైదీ నంబర్ 150 సినిమా ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

vinayak

మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌ దర్శకుడు వి.వి.వినాయక్‌. ‘ఆది’ నుంచి ‘అఖిల్‌ వరకు ఆయన సినిమాలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. అంతేకాదు ఎంతోమందికి సాయం చేసే సేవాగుణం కూడా ఆయనలో ఉంది. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’. కాజల్‌ కథానాయిక. కొణెదల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రాంచరణ్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం వినాయక్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘ఖైదీ నంబర్‌ 150’ బృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. రాంచరణ్‌, కాజల్‌, దేవిశ్రీ ప్రసాద్‌, తోట తరణి, పృథ్వీ తదితరులు వినాయక్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

https://youtu.be/rDZ4aiKjEXA

- Advertisement -