రవితేజ “క్రాక్” ఫస్ట్ లుక్

580
Krack
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా మూవీలో నటిస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో నభా నటేశ్, పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా జనవరి 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈమూవీతో పాటు రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఈమూవీకి క్రాక్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కొన్నేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల‌లో జ‌రిగిన రియ‌ల్ ఇన్సిడెంట్స్‌తో మూవీని తెర‌కెక్కించనున్నారు . థ‌మ‌న్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈసినిమాలో కీలక పాత్రలో సముద్రఖని కనిపించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఈమూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఇందులో రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. కాగా గోపిచంద్ మలినేని రవితేజ కాంబినేషన్ లో గతంలో బలుపు సినిమా తెరకెక్కింది. ఈమూవీ మంచి విజయం సాధించింది.

- Advertisement -