అఫిషియల్..మాస్ జాతర వాయిదా

3
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం #RT76(మాస్ జాతర)తో మరోసారి తన సిగ్నేచర్ ఎనర్జీతో అలరించబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే హై ప్రొడక్షన్ వాల్యూస్ తో చిత్రాలను అందించే SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న #RT76 హ్యుమర్, ఎమోషన్స్ తో కూడిన హోల్సమ్ ఎంటర్ టైనర్ గా వుండబోతోంది.

దర్శకుడు కిషోర్ తిరుమల, రవితేజ ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడిన ఫుల్ లెంత్ ఫ్యామిలీ డ్రామాని రాశారు. రవితేజ ఈ సినిమా కోసం చాలా స్టైలిష్ గా మేకోవర్ అయ్యారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగస్టు 27 అని ప్రకటించారు.

అయితే తాజాగా ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్ట్రైక్ కారణంగా సినిమా పనులు ఆలస్యం అయ్యాయి అని అందుకే వాయిదా వేస్తున్నట్టు సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ తెలిపింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తామని వెల్లడించారు.

Also Read:శ్రీవారి సన్నిధిలో తిలక్ వర్మ

- Advertisement -