ఢిల్లీలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయంతీసుకున్నారు. ఢిల్లీలోని అన్ని మీడియా హౌస్ లలో మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలని..ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ వాళ్ల వాళ్ల ఆఫీసుల్లోనే ఉచితంగా వ్యాక్సిన్ ను అందించనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ఢిల్లీలో ఆక్సిజన్ పరిస్ధితి అదుపులోనే ఉందని…. ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ చనిపోకుండా చూడాలని,వ్యాక్సినేషన్ డ్రైవ్ ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ 2-3 వ్యాక్సినేషన్ సెంటర్లను సందర్శించి తనీఖీలు చేయాలని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లను కేజ్రీవాల్ ఆదేశించారు.
18-45ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభమైన మొదటి నాలుగు రోజుల్లోనే 1.84 లక్షల మందికి వ్యాక్సిన్ మొదటి డోసు ఇవ్వడం జరిగిందని …ఇప్పటివరకు అన్నివయసు వారికి 38.88లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చామని తెలిపారు.