గుడ్ న్యూస్…వెనక్కి తగ్గిన వాట్సాప్

75
app

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాడుతున్న ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌ వాట్సప్. ఎన్నో ఇన్‌స్టంట్ మెసెంజర్ యాప్‌లు అందుబాటులోకి వచ్చినా.. వాట్సప్ ఆకట్టుకున్నంతగా ఆకర్షించలేకపోయాయి. ఎప్పటికప్పుడు సరికొత్త పీచర్స్‌తో వినియోగదారులకు దగ్గరవుతున్న వాట్సాప్…ఇటీవలి కాలంలో తీసుకొచ్చిన కొత్త విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

కొత్త ప్రైవ‌సీ పాల‌సీని తీసుకొచ్చి…భారత యూజర్లు మే 15 వరకు అంగీకరించాలని షరతు విధించగా కేంద్రం సహా యూజర్ల నుండి పెద్ద ఎత్తున ఆగ్రహంవ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది వాట్సాప్. ఈ ప్రైవసీ పాలని అంగీకరించాలన్న గడువును ఎత్తివేసింది.

ఈ నిబంధనలను అంగీకరించకపోయినప్పటికీ ఖాతాల తొలగింపు ఉండబోదని పేర్కొంది. అయితే సర్వీసులకు సంబంధించిన కొత్త నిబంధనలను పొందిన వినియోగదారుల్లో చాలా మంది అంగీకరించారని…. కొంత మంది మాత్రం అంగీకారం తెలపలేదని పేర్కొంది