బిగ్ బాస్ తెలుగు…సీజన్ 5 ఎప్పుడో తెలుసా..!

69
bigg boss

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 4 సీజన్స్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. 4వ సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలవగా తాజాగా 5వ సీజన్‌కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది.

తాజా సమాచారం ప్రకారం అగష్టులో బిగ్‌బాస్‌ 5ని ప్రారంభించాలని నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారట. గతేడాది మాదిరిగానే కంటెస్టెంట్స్‌ను ముందుగా క్వారంటైన్‌ ఉంచనుండగా కంటెస్టెంట్స్‌ ఎంపిక దాదాపు పూరైందనట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్-1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ తెలుగు సీజన్-2కు నేచురల్ స్టార్ నాని హోస్టులుగా వ్యవహరించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్-3,4 లకు మాత్రం కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు.