లైవ్ లో కొట్టుకున్నారు..మళ్ళీ కలిశారు(వీడియో)

342
Fight In Live Debate Show
- Advertisement -

టీవీ ఛానెళ్లలో రాజకీయ నాయకులు తమ పార్టీల గురించి చెప్పుకుంటూ ఇతర పార్టీలపై విమర్శలు చేస్తుంటారు. ఈక్రమంలో ఎవరో ఒకరు కొంచెం ర్యాష్ గా మాట్లాడితే ఆ గొడవ కొంచెం సీరియస్ గా మారిన సంగతులు మనం చూసే ఉంటాం. అయితే తాజాగా పాకిస్ధాన్ లోని ఓ న్యూస్ ఛానల్ చర్చాకార్యక్రమంలో ఇద్దరు నాయకులు ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుప్పించుకున్నారు. పాకిస్ధాన్ అధికార పార్టీ తెహ్రీక్‌-ఎ- ఇన్సాఫ్‌ (పీటీఐ) నేత మసూర్‌ అలీ సియాల్‌, కరాచి ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఇంతియాజ్‌ ఖాన్‌ తీవ్ర విమర్శల అనంతరం ఇద్దరూ కొట్టుకున్నారు.

ఈ చర్చా కార్యక్రమంలో ప్రభుత్వంపై ఇంతియాజ్ విమర్శలు గుప్పిస్తుండగా, ఇద్దరు నేతల మధ్యా మాటమాట పెరిగింది. సహనం కోల్పోయిన మసూర్‌ అలీ అతన్ని కొట్టారు. దీంతో ఇంతియాజ్ సైతం ప్రతిదాడికి దిగారు. ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. కాసేపయ్యాక మళ్లీ ఇద్దరూ వచ్చి అదే డిబెట్ లో కూర్చున్నారు. ఈ వీడియోను పాక్‌ కు చెందిన ఓ మహిళా జర్నలిస్ట్‌ తన ట్విట్టర్ ఖతాలో షేర్ చేసుకున్నారు. “దాడిచేయడమేనా నయాపాకిస్తాన్‌” అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు.

- Advertisement -