యుద్ధం చేయాల్సింది రాముడే..కల్కి ట్రైలర్‌

417
kalki trailer
- Advertisement -

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘కల్కి’. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. ‘అ!’ వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.

సస్పెన్స్,యాక్షన్,ఎమోషన్ సీన్స్ అన్ని కలగలిపిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. కొల్లాపూర్ ప్రాంతంలో జరిగే అరాచకాలు,వాటిని అరికట్టడానికి హీరోగా ‘కల్కి’ రంగంలోకి దిగడాన్ని ఈ ట్రైలర్లో చూపించారు. హనుమంతుడు సాయం మాత్రమే చేస్తాడు .. యుద్ధం చేయవలసింది రాముడే అనే డైలాగ్ బాగుంది.

ఇక ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, కమర్షియల్ ట్రైలర్, ‘హార్న్ ఓకే ప్లీజ్’, ‘ఎవరో ఎవరో’ పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ఈ నెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రాజశేఖర్ సరసన ఆదా శర్మ నటించిన ఈ మూవీ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి…..

- Advertisement -