ఫెన్సింగ్ క్రీడను ప్రోత్సహించండి:కేటీఆర్‌కు మర్రి విజ్ఞప్తి

57
ktr

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జాతీయ స్థాయిలో క్రీడా రంగంలో పురోగతి సాధిస్తుందని అందులో భాగంగా రాష్ట్రంలో ఒలింపిక్ స్ధాయి క్రీడైన ఫెన్సింగ్ కు తగిన ప్రాచుర్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ క్రీడల విభాగంలో ఫెన్సింగ్ ను చేర్చి క్రీడల పట్ల వారికి ఆసక్తి కనబరిచేలా కృషి చేయాలని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించారు.

డీజీపీతో మాట్లాడి సానుకూలంగా స్పందించారు అని వివరించారు. రాష్ట్రంలో మారుమూల గ్రామాల నుండి పెద్ద నగరాల వరుకు ఉత్సహవంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి క్రీడల పట్ల ఫెన్సింగ్ పట్ల ప్రత్యేక తర్ఫీదు ఇస్తామని తెలిపారు.