- Advertisement -
74 లక్షల కుటుంబాలకు మందికి 1500 రూపాయల చొప్పున 1011 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. అందుకు సంబంధించిన మెసేజ్ లు వస్తున్నాయని తెలిపారు సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.
87.54 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులున్నారని…వీరిలో 77 లక్షల 13 వేల కుటుంబాల్లో 2 కోట్ల 40 లక్షలు మంది బియ్యం తీసుకున్నారని చెప్పారు.
ఏప్రిల్ లో 88 శాతం మంది రేషన్ తీసుకున్నారు….పోర్టబులిటీలో భాగంగా 13 లక్షల మంది ఇతర రాష్ట్రాల వాళ్ళు బియ్యం తీసుకున్నారని వెల్లడించారు. రూ. 2214 కోట్లు ప్రభుత్వం లబ్ధిదారులకు ఖర్చు చేసిందన్నారు.
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూస్తున్నాం….. హమాలీల కోసం ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడిపి వారిని తెలంగాణకు తీసుకు వస్తాం అన్నారు.
- Advertisement -