రైతులు ఆందోళన వద్దు…చివరి గింజ వరకు కొంటాం

41
ts

సివిల్ సప్లై శాఖ ద్వారా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతు పండించిన పంటను ప్రతి గింజను కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి. సీఎం కేసీఆర్ పెద్ద మనసు తో రైతులను ఆదుకోవడం కోసం కరోనా కట్టడి లో సైతం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయాలని ఆదేశించారని తెలిపారు.

7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటున్నాం…..దాదాపు చాలా జిల్లాలో 70 శాతం కొనుగోలు పూర్తి అయిందని వెల్లడించారు. నిజామాబాద్, నల్గొండ జిల్లాలో కొనుగోలు పూర్తి అయింది…..నిన్న సాయంత్రం వరకు 61 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.ధాన్యం కొనుగోలు పై రోజు సమీక్షలు చేస్తున్నాం…. ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం అన్నారు.ఎక్కడైనా ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు తలెత్తకుండా చూశాం….11 వేల 500 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తాం అన్నారు.

కొనుగోలు చేశాక ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతా లో వేస్తున్నం …..ధాన్యం కొనుగోలు చేశాక గోదాం లలో కొన్ని సమస్యల వలన లెట్ అవుతుంది దాన్ని కూడా అధిగమిస్తాం అన్నారు.కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి ,సీఎం కేసీఆర్ నిర్ణయించిన సమయం కంటే ముందే పూర్తి చేయాలన్నారు.రైతులు ఆందోళన చెందవద్దు, పూర్తి ధాన్యం కొనుగోలు చేస్తాం అన్నారు.ట్రాన్స్ పోర్ట్ కు సహకరించని ట్రాన్స్ పోర్ట్ వాహనాల ఓనర్ లను బ్లాక్ లిస్ట్ పెడుతాం….సివిల్ సప్లై,ఎల్పీజీ డెలివరీ ,పెట్రోల్ బంక్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వారికి మా శాఖ తరుపున కృతజ్ఞతలు అరి తెలిపారు.