బంగారు తెలంగాణ బాటలో…

231
govenor narasimhan

ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయిందని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. రెండోసారి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్‌ సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రభుత్వం ముందుకుసాగుతోందన్నారు.

కొత్త జోనల్ విధానంతో స్ధానికులకే ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు లభించడం సంతోషమన్నారు. అవినీతికి తావులేకుండా ముందుకువెళ్తున్నామని చెప్పారు. పారిశ్రామిక, ఐటీ రంగంలో పారదర్శక విధానాలు అమలవుతున్నాయని గవర్నర్‌ అన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు.దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు.

ముందుచూపుతో ప్రభుత్వం విద్యుత్ సమస్యను అధిగమించిందన్నారు. కొత్త పవర్ ప్లాంటుల నిర్మాణం పూర్తికావొస్తుందన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ టాప్‌ పొజిషన్‌లో ఉందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు,విత్తనాలు అందిస్తున్నామని చెప్పారు.

రైతు బంధు పథకం ప్రపంచంలో ఎక్కడా లేదన్న గవర్నర్‌ ఎకరాకు రూ. 10 వేల పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు.వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.ఇంటింటికీ మంచినీరు అందించే మిషన్ భగీరథ పథకం బృహత్తర పథకం అని కొనియాడారు. తెలంగాణ చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి అన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపట్టిందన్నారు.ఎస్టీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజీలు నిర్మిస్తున్నామని చెప్పారు.తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటుచేశామని చెప్పారు. 3 వేల మంది ఎస్టీలు సర్పంచులు కాబోతున్నారని తెలిపారు.