నిన్ను చూస్తే గర్వంగా ఉంది..మై లవ్

302
anushka virat
- Advertisement -

72 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై సరికొత్త చరిత్రను సృష్టించింది టీమిండియా. ఇప్పటివరకు ఏ కెప్టెన్‌కు సాధ్యం కాని విధంగా కంగారులపై గెలిచి సరికొత్త రికార్డును సృష్టించాడు కోహ్లీ. టెస్టు సిరీసే కాదు వన్డే సిరీస్‌ను కూడా నెగ్గి సత్తాచాటింది. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సువర్ణ

ఈ సందర్భంగా భారత ఆటగాళ్లపై క్రికెట్‌ అభిమానుల నుంచి ప్రముఖుల వరకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కోహ్లీపై మాజీ కెప్టెన్ల దగ్గరి నుండి వివిద దేశాల ఆటగాళ్లు సైతం ప్రశంసలు గుప్పిస్తున్నారు.

తాజాగా కోహ్లీ వైఫ్‌ బాలీవుడ్ నటి అనుష్క శర్మ…టీమిండియాను పొగడ్తలతో ముంచెత్తింది. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని మై లవ్ అంటూ ట్వీట్ చేశారు. మరుపురాని, అద్భుతమైన పర్యటన ఇది. టీమిండియా చారిత్రక విజయాలను ప్రత్యక్షంగా చూసినందుకు ఎంతో ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు అనుష్క.

- Advertisement -