ఇద్దరు మావోయిస్టులు లొంగుబాటు

10
- Advertisement -

ఎస్పీ సింధు శర్మ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నేతలు గుర్రాల విజయ్ కుమార్ అలియాస్ ఆకాష్, బాలకృష్ణలు పోలీసులకు లొంగిపోయారు. కొత్తగూడెం జిల్లాకు చెందిన గుర్రాల విజయ్ కుమార్ 2024 లో పుసుగుప్ప సిఆర్పిఎఫ్ క్యాంప్ పై దాడి కేసులో నిందితుడు.

8 సార్లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో పాల్గొన్నాడు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాకు చెందిన బాలకృష్ణ ఎదురు కాల్పుల ఘటనల్లో నిందితుడుగా ఉన్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ సిద్దాంతాల పట్ల ఆకర్షితులై పార్టీ లో చేరారు. కామారెడ్డి జిల్లాకు చెందిన ఐదు మంది మావోయిస్టులు ఆజ్ణాతంలో ఉన్నారని ఎస్పీ సింధు శర్మ తెలిపారు.

Also Read:కిషన్ రెడ్డిపై మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్

- Advertisement -