- Advertisement -
మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. శాంతి చర్చలకు సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చింది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే శాంతి చర్చలకు ముందుకు వస్తామంటూ లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ.
ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న నరసంహారాన్ని వెంటనే నిలిపేయాలని మావోయిస్టు షరతు విధించింది. ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర , ఒడిస్సా ఝార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్కౌంటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేసింది.
మేధావులు , ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్ష నేతలు , శాంతి చర్చల కమిటీ, మీడియా చొరవ చూపాలని లేఖలో పేర్కొన్నారు మావోయిస్టులు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదల చేశారు.
ALso Read:పాక్ కవ్వింపు చర్య..తిప్పికొట్టిన భారత్
- Advertisement -