- Advertisement -
ఈనెల 24న దేశవ్యాప్త బంద్‍కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మావోయిస్టు కేంద్ర కమిటీ డిమాండ్ చేసింది.అలాగే ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల, ఆశన్నకు మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ హెచ్చరిక జారీ చేసింది.
మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖను విడుదల చేశారు. విప్లవ ఉద్యమానికి ద్రోహం చేసిన మల్లోజుల, ఆశన్నకు శిక్ష తప్పదు అని లేఖలో హెచ్చరించారు.
కుట్రదారుల కార్యాచరణ ఆపరేషన్ కగార్ తో మొదలైంది…. మల్లోజుల, ఆశన్న నమ్మక ద్రోహాన్ని పార్టీ తీవ్రంగా భావిస్తోంది అని మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ తెలిపారు.
Also Read:పోలీసుల త్యాగాలను మర్చిపోలేం:రేవంత్
- Advertisement -

