పోలీసుల త్యాగాలను మర్చిపోలేం:రేవంత్

13
- Advertisement -

పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గోషామహల్ స్టేడియంలో నూతన పోలీస్ అమర వీరుల స్మారక స్థూపం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ శివధర్ రెడ్డి, హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీ ఆనంద్, డీజీలు, ఐజీలు, కమిషనర్లు, మాజీ డీజీపీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి… విధి నిర్వహణలో వీర మరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని తెలిపారు. రూ.కోటి పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం అందిస్తాం అన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారం చెల్లిస్తాం అని రేవంత్ తెలిపారు.

సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రతినిత్యం ప్రజల రక్షణ కోసం, కర్తవ్యదీక్షలో ప్రాణ త్యాగాలు చేసిన యోధుల సేవలు ఎంతో స్ఫూర్తి దాయకమని, వారి త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని పేర్కొన్నారు.

Also Read:H1B:విద్యార్థులకు భారీ ఊరట

- Advertisement -